MONEY MANTRA

– మానవ ఉజ్వల భవిష్యత్తుకై మేధావి వర్గానికి చెందిన అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ తమ సిధ్ధాంతాలను అనుసరించి జీవన శైళిలో, వైద్య రంగంలో, యుద్ధ విద్యలో, జ్యోతిశ్యాస్త్రంలో, రాజకీయ రంగంలో, ఇతర రంగాల ద్వారా నాగరికతను కొత్త పుంతలు తొక్కించడంలో దోహదపడ్డారు. తద్వారా మనిషి కొన్ని పద్దతులను, కట్టుబాట్లను, సంస్కృతిని, నాగరికతను నేర్చుకున్నాడు. కానీ ఆర్ధికంగా సమున్నతమైన స్థానం, సమృద్ధియైన జీవితం, విస్తృతమైన, అనంతమైన పరిధులను వివరించి, మానవ మేధస్సుకు ఎల్లలు లేవనీ, అత్యంత శక్తివంతమైన మనోశక్తి ప్రతి మానవుడు సులభంగా కలిగియున్నాడనీ, ప్రతీ వ్యక్తి సకల సంపదలకు, సిరులకు, భోగభాగ్యాలకు వారసుడనీ, వాటిని తమ తమ శక్తి ద్వారా అతి సులభంగా సాధించవచ్చనీ, కొత్త నాగరికతకు, ఆలోచనా విధానానికి నాంది పలికి, నవ శఖానికి మార్గం వేసిన వేదికయే “మనీ మంత్ర”.

The Father of Money Mantra” అలాగే “High Range Book of World Recrods” అవార్డు గ్రహీత “శ్రీ శ్రీ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు” తమ ఉపన్యాసాల ద్వారా, వీడియో మాధ్యమాల ద్వారా అతి సామాన్యుడిని సైతం అసాధారణ వ్యక్తిగా, సంపన్నుడిగా మార్చిన ఉదాహరణలు కోకొల్లలు.

ప్రతీ వ్యక్తి సకల సంపదలకు, సిరులకు, భోగభాగ్యాలకు వారసుడనీ, వాటిని తమ తమ శక్తి ద్వారా అతి సులభంగా సాధించవచ్చనీ, కొత్త నాగరికతకు, ఆలోచనా విధానానికి నాంది పలికి, నవ శఖానికి మార్గం వేసిన వేదికయే “మనీ మంత్ర”.

కుంచించుకుపోయిన మానవ మేధస్సును సానపట్టి, మసకబారి మూగవోయిన పేద గొంతుకలకు ఊపిరులూది ” మనీ మంత్ర” ద్వారా విహంగ వీక్షణం చేయించిన చెలికాడు. లేని సంకెళ్లతో కట్టివేయబడి ఉన్నామనే భ్రమలో బతుకులను ఈడుస్తున్న అమాయక ప్రజల ఆశలకు స్వేచ్చనిచ్చిన విశ్వచక్రవర్తి “శ్రీ శ్రీ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు” తన మాటల ద్వారా మనిషి జీవన విధానాన్ని సుఖమయమైన, సమృద్ధిమయమైన, సంపన్నమయం అయ్యేలా జ్ఞానాన్ని ప్రజలకు అందించడం, అందరినీ ఆర్ధికంగా జాగృతం చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రపంచమంతా విస్తరిస్తున్న మంత్రం ” మనీ మంత్ర”.